ఈ మంత్రుల రూటే సపరేటు.. ఒక్కొక్కరికి మూడు ఆఫీసులు

-

ఏపీలో కొందరు మంత్రులు ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారు. సచివాలయంలో కార్యాలయాలు ఉన్నా ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇద్దరు మంత్రులకైతే ఏకంగా మూడేసి ఆఫీసులు  ఉన్నాయి. మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్‌కు సచివాలయంలోనే కాకుండా క్యాంపు ఆఫీసులో ఒకటి, ఏపీఐఐసీ భవనంలో ఇంకోటి.. మొత్తం మూడు ఆఫీసులు ఉన్నాయి.

ఈ కార్యాలయాలకు ప్రత్యేకంగా ఎలాంటి అనుమతి లేకపోయినా లక్షల రూపాయల వ్యయంతో ఈ ఛాంబర్లను ప్రతినెల నిర్వహించాల్సి వస్తోంది. వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా ఏపీఐఐసీ భవనంలో నిబంధనలకు విరుద్ధంగానే కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా శాఖలే ఈ కార్యాలయాల కోసం అదనపు వ్యయాన్ని భరిస్తున్నాయి. ముఖ్యమంత్రి సచివాలయానికి రాకపోవటంతో వారూ సచివాలయానికి రాకుండా ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు.

ఏపీ సచివాలయంలో మంత్రుల హాజరు తక్కువగా ఉంటోంది. కేబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు మినహా మంత్రులంతా ఒకే దఫా హాజరు అవుతున్న సందర్భాలు ఒక్కటి కూడా నమోదు కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా వాటిని అమలు చేస్తున్న పరిస్థితి ఉండటం లేదు. మంత్రులతో పాటు కార్యదర్శులంతా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని పదేపదే సర్క్యులర్ లు జారీ చేస్తున్నా సీఎస్ మాట కూడా లెక్కచేయని పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news