పవన్‌ కళ్యాణ్‌ కు ఏపీ పోలీసుల షాక్‌..ర్యాలీలపై నిషేధం

-

పవన్‌ కళ్యాణ్‌ కు ఏపీ పోలీసులు షాక్‌ ఇచ్చారు. నేడు మచిలీపట్నంలో జనసేన వార్షిక ఆవిర్భావ సభ జరుగనుంది. బందరు శివారులో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం నిర్వహించనున్నారు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి వారాహి వాహనంలో బయల్దేరనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

అయితే, దీనిపై జిల్లా ఎస్పీ పి జాషువా.. ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ రోజు మచిలీపట్నం జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం జరుగనుందని… జిల్లా పోలీస్ యంత్రాంగం 400 మంది పోలీసులు, మహిళా పోలీసులు పహారా ఉంటుందని తెలిపారు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. బైక్ ర్యాలీలు నిషేధం అని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ పి జాషువా. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందుబాటులో రెండు అంబులెన్సులు,రెండు ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసామని..ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ప్రశాంతంగా సభ జరుపుకోవాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ పి జాషువా.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version