నీలోఫర్ లో దారుణం..రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్ !

-

హైదరాబాద్‌ లని నీలోఫర్ ఆసుప త్రి లో దారుణం చోటు చేసుకుంది. కేవలం వంద రూపాయల కోసం అభం శుభం తెలియని… ఓ బాలుడి ప్రాణం తీశాడు నీలోఫర్‌ ఆస్పత్రి వార్డ్ బాయ్. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఎర్రగడ్డ కు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంత కాలంగా నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. మూడు రోజుల క్రితం మహ్మద్ ఖాజాను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు.

బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. బాలుడికి ఆక్సిజన్ పై చికిత్స అందించారు వైద్యులు. అయితే…బాలుడు చికిత్స పొందుతున్న వార్డులోనే మరొక.. వ్యక్తికి ఆక్సిజన్‌ కావాల్సి వచ్చింది. దీంతో వార్డు బాయ్ కి 100 రూపాయలు ఇచ్చాడు మరొక పేషెంట్. దీంతో బాలుడి ఆక్సిజన్ తీసివేసి రూ.100 ఇచ్చిన పేషెంట్ కు ఆమార్చాడు వార్డు బాయ్. దీంతో ఆక్సిజన్ అందక బాలుడు మృతి చెందాడు. ఇక ఈ బాలుడు ఘటనపై సూపర్డెంట్ సీరియస్‌ అయ్యారు. బాలుడు మృతి కి కారణమైన వార్డ్ బాయ్ ని సస్పెండ్ చేశారు ఆస్పత్రి సూపర్డెంట్.

Read more RELATED
Recommended to you

Latest news