ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. ఒంటరిగా ఆడది కనిపిస్తే అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. వావీ వరస, చిన్నా పెద్ద అన్న భేదం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు తెచ్చినా కామాంధుల్లో భయం పుట్టడం లేదు. మమా మాటలు చెబుతూ తెలిసిన వారే అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలోని విజయవాడలో ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టారు ముగ్గురు యువకులు.
తాజాగా విజయవాడలో దారుణం చోట చేసుకుంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఈ దారుణం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో యువతిపై ఒప్పంద కార్మికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు తన స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్యాచారానికి గురైన యువతి నిందితుడి ప్రియురాలే అని సమాచారం. ప్రియుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు.