ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఏపీలో చేపల వేట నిషేధం

-

ఏపీ లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేటను 61 రోజులపాటు నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలైన మెకనైజ్డ్ మోటారు బోట్ల ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకూ మొత్తం 61 రోజుల పాటు వేటను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యం లో జి.ఓ. ఆర్ టి. నెం. 76ను ఏప్రిల్ 6వ తేదీన విడుదల చేశారు. సముద్ర జలాల్లో చేపల వేట నిషేధించడం ద్వారా పునరుత్పత్తి అవకాశాలను మెరుగుపర్చడం లక్ష్యమన్ని తెలిపారు. సముద్రంలో లభించే చేపలు రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను రొయ్యలను సంరక్షించడం ద్వారా వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం తద్వారా సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి కృషి చెయ్యడమే అని వెల్లడించారు.

Andhra government announces Rs. 10,000 to 1 lakh fishermen amid ban on  fishing

నిషేధ ఉత్తర్వులను అనుసరించి సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు- మెకనైజ్డ్ మరియు మోటారు బోట్లపై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య సంపద అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా చేపల వేటకు చేపడితే ఆయా బోట్ల యజమానులను ఆంధ్ర ప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994, సెక్షన్ (4) ననుసరించి శిక్షార్హులు అవుతారని తెలిపారు. నిషిద్ద సమయంలో వేట సాగించే బోట్లను, బోటులో ఉండే మత్స్య సంపదను స్వాధీన పరచుకోవడంతో పాటు జరిమానా విధిస్తూ ప్రభుత్వం అందించే అన్ని రకాల రాయితీలను, సౌకర్యాలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news