వామ్మో వీటిని తింటున్నారా..? అయితే కిడ్నీ లో రాళ్లు తప్పవు..!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి అలానే ప్రతిరోజు మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. చాలా మంది తెలియక చేతులారా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు నిజానికి ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు తప్పవు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులతో పాటుగా కిడ్నీల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనది. కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోవద్దు.

డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం ఉంది. ఉప్పుతో వేయించిన వాటిని కూడా తీసుకోవద్దు ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రాళ్ళని చేరుస్తాయి. అలానే పిజ్జా, బర్గర్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎక్కువ మంది ఈ మధ్య వీటిని తీసుకొని ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు.

కిడ్నీలో రాళ్లు మొదలు వివిధ రకాల సమస్యలు వస్తాయి కొన్ని రకాల సప్లిమెంట్స్ ని తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం ఉంది. పొటాషియం విటమిన్ డి కాల్షియం వుండే సప్లిమెంట్స్ కారణంగా కూడా ఇది వస్తుంది.

బ్లాక్ టీ వలన కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది. కనుక బ్లాక్ టీ కి కూడా దూరంగా ఉండటం మంచిది. అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్ వలన కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది అలానే అతిగా బాదం జీడిపప్పు తీసుకుంటే కిడ్నీ దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి లిమిట్ గానే తీసుకోవడం మంచిది ఈ సమస్య వచ్చిందంటే తేలికగా తీసుకోకండి ఈ సమస్య కలిగిందంటే డాక్టర్ని సంప్రదించండి చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలియదు. కానీ సడన్ గా ఆపరేషన్ పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news