హిందూ సంప్రదాయంలో దేవుళ్లకు నైవేద్యం పెట్టడం అందరికీ అలవాటు. ఆ ప్రసాదాన్నే.. పంచి పెడుతుంటారు. కళ్లకుఅద్దుకుని మరీ తింటాం. అంటే మనం నైవేద్యంగా పెట్టినవి దేవుడు తిన్నాడని నమ్మకం. అయితే ఇలా దేవుడికి ప్రసాదం సమర్పించేటప్పుడు చాలా ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. నైవేద్యం సమర్పించే విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. అవి అందరికీ తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. నైవేద్యం పెట్టేప్పుడు భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. నియమాల గురించి చూద్దాం.
ప్రసాదం తయారీలో నూనె: చాలా మంది దేవుడికి సమర్పించే నైవేద్యాలను నూనెతో ఎక్కువగా తయారు చేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం, దేవుడికి నెయ్యితో చేసిన వస్తువులను నైవేద్యంగా సమర్పించాలని పేర్కొంది. అలాగే మిరపకాయలతో కూడిన వస్తువులను దేవుడికి ప్రసాదంగా సమర్పించకూడదు. ఈ పొరపాటు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట. కనుక ప్రసాదం తయారీకి ఎల్లప్పుడూ నెయ్యిని ఉపయోగించాలట..
ఈ తప్పు అస్సలు చేయవద్దు: దేవుడికి భక్తితో నైవేధ్యాన్ని సమర్పిస్తారు. అయితే కొన్ని సార్లు దేవుడికి ఆహారపదార్ధాలను నైవేద్యంగా సమర్పించి.. వెంటనే వాటిని అక్కడ నుంచి తీసివేసి తింటారకు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, భగవంతుని ముందు ఉన్న నైవేద్యాన్ని అలా వెంటనే తొలగించడం అశుభమట.. ఆహారపదార్ధాలను, పండ్లను, ఇలా ఏ పదార్ధాలను నైవేద్యంగా సమర్పించినా.. అక్కడ నుంచి వెళ్లాలని.. కొంత సమయం తర్వాత, దేవునికి నమస్కరిస్తూ, భగవంతుని ముందు నుండి నైవేద్యంగా సమర్పించిన వస్తువులను తీసుకోవాలి.
తులసిని సమర్పించవద్దు: శివుడికి పూజ చేసేటప్పుడు తులసి ఆకులను సమర్పిస్తుంటారు. తులసి ఆకులను శివునికి, గణేశుడికి సమర్పించకూడదని చెబుతారు. శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. ఎల్లప్పుడూ బిల్వ పత్రాలను సమర్పించాలి.. అదే సమయంలో.. గణేశుడికి దర్భలను సమర్పించాలట.
ఆవుకు ఆహారం: వండిన ఆహారాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి. అయితే అలా దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత, మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు.. కానీ ముందుగా ఈ ప్రసాదాన్ని ఆవుకి పెట్టడం మేలు చేస్తుంది. ఆవుకి నైవేద్యం పెట్టిన అనంతరం ఆ ఆహారాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఆవుకు ఆహారం అందించడం ద్వారా సమస్త దేవతలు చాలా సంతోషిస్తారని.. ఆ దేవతల అనుగ్రహం భక్తులపై ఉంటుందని పండితులు అంటున్నారు.
దేవుడిని పూజించే విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి మరీ..!
-Triveni Buskarowthu