మీరనుకున్న గమ్యం వైపు వెళ్తున్నారా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి..

-

జీవితంలో ప్రతీ ఒక్కరికీ గమ్యం ఉండాలి. అది చిన్నదైనా పెద్దదైనా ఎక్కడి వెళ్ళాలన్న కోరిక తప్పకుండా ఉండాలి. రేఫు చాక్లెట్ కొనాలనుకోవాలి అనే దగ్గర నుండి వ్యాపారవేత్తగా చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకునే వరకు ప్రతీదీ గమ్యమే. గమ్యం నిర్ధారించుకుంటే సరిపోదు. దాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి. కృషి చేయకుండా గమ్యం పెట్టుకుని ఇంకా చేరడం లేదని ఆలోచించుకుంటూ కూర్చోవడం పంక్చర్ అయిన బస్సులో కూర్చుని ఎక్కడికి వెళ్ళట్లేదేంటి అన్నట్టే ఉంటుంది.

ఐతే గమ్యం నిర్ధారించుకున్నారు. దాని కోసం బాగానే పనిచేస్తున్నారు. మరి ఆ గమ్యానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నారు? ఇంకా ఏమిచేస్తే ఆ గమ్యాన్ని తొందరగా చేరుకుంటారు? అసలు మీరు ఎంచుకున్న గమ్యానికి సరైన దారిలోనే వెళ్తున్నారా అనే విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలు ఎలా తెలుస్తాయనేది ఇప్పుడు చూద్దాం.

ఉదాహరణకి, 2021వరకి హోటల్ ప్రారంభించాలని 2020లోనే అనుకున్నారు. ఈ సంవత్సర కాలంలో దానికోసం ఏం చేసారు. డబ్బులు జమచేసుకున్నారా? హోటల్ కి కావాల్సిన స్థలం, సహా మిగతా అన్నీ కుదుర్చుకున్నారా? ఎక్కడ లోపం జరుగుతుంది? డబ్బుల్లో ఐతే వాటిని సంపాదించడానికి ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేస్తే అనుకున్న పని సకాలంలో జరుగుతుంది. వెనకబడడానికి కారణాలు ఏంటి? అగ్రెసివ్ గా పనిచేయకపోవడమా? లేక ఎంత పనిచేసినా బయట నుమ్డి వచ్చే సమస్యల కారణంగా హోటల్ తెరవలేకపోతున్నారా అన్నది ఆలోచించుకోవాలి.

ఏదైనా భాష నేర్చుకోవాలని అనుకున్నారనుకుందాం. మీరనుకున్నప్పటి కంటే ఇప్పటి వరకు ఎంత నేర్చుకున్నారు. నిజంగా మీరనుకున్నట్టే సాగుతుందా? రోజులో కనీసం ఒక కొత్త పదమైనా( ఆ భాషలోనిది) నేర్చుకుంటున్నారా?

జాబ్ తెచ్చుకోవాలని అనుకున్నారు. ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో గుర్తించారా? అక్కడదాకా వెళ్ళడానికి మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఏమిటి? గమ్యం చేరాలనుకున్న ప్రతీ ఒక్కరికీ దారి సవ్యంగా ఉండకపోవచ్చు. మీకేది అడ్డు వస్తుందో తెలుసుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేరు. మీరెటు వెళ్తున్నారో మీకే తెలియకపోతే ఎదుటి వారు ఏది చెప్తే అది చెయ్యాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ముందే చెప్పినట్టు గమ్యం చిన్నదైనా, పెద్దదైనా..

Read more RELATED
Recommended to you

Latest news