సున్నితత్వం అనేది వ్యాధి కాదు. దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అవతలి వారిలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకుని దానికి స్పందించడమే సున్నితత్వం. సున్నితంగా ఉండే మనుషులు, ఎదుటీ వారి జీవితంలోని బాధలను త్వరగా అర్థం చేసుకుంటారు. అందుకే వారు సమాజం నుండి విడివడినట్టుగా ఉంటారు. మీరు సున్నిత మనస్కులా కాదా అన్న విషయం తెలుసుకోవాలంటే కింది లక్షణాలు మీలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి.
విపరీతమైన భావోద్వేగం
అవతలి వారి అవసరాలను, అభద్రతను గుర్తించి, దాన్నుండి ఎలా బయటపడేయాలి అని ఆలోచిస్తారు. ఎదుటి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. విపరీతమైన భావోద్వేగం కారణంగా ఎవ్వరినైనా చాలా తొందరగా అర్థం చేసుకుంటారు.
నువ్వు అనుకున్న లక్ష్యాలను చేరలేనపుడు నీ మీద నువ్వే గట్టిగా స్పందిస్తావు
నీ లక్ష్యాలను చేరుకోవాలని పనిచేస్తున్నప్పుడు అక్కడకు వెళ్ళడానికి ఆలస్యం అవుతున్నా, లేదా చేసే పనుల్లో ఏదైనా తేడాలు కనిపించినా నిన్ను నువ్వు నిందించుకుంటావు. నువ్వు చేసే పని గొప్పగా ఉన్నప్పటికీ నిన్ను నువ్వు కోపగించుకుంటావు.
విమర్శలను తట్టుకోలేరు
ఎక్కువ సున్నితత్వం కలిగినవారు విమర్శలను తట్టుకోలేరు. చిన్న చిన్న వాటికి కూడా స్పందిస్తారు. విమర్శలు రావద్దని మరింత కృషితో పని చేయడం మొదలెడతారు. కొన్ని కొన్ని సార్లు దీనివల్ల ఒత్తిడి, డిప్రెషన్ కలగవచ్చు.
అవతలి వారి సంతోషం కోసం ఎక్కువ పనిచేస్తారు
ఎదుటి వారు సంతోషించాలని ఎక్కువగా ఆలోచిస్తారు. తమ చుట్టుపక్కల వాతావరణం బాగుండాలని, దానికోసం శ్రమ పడతారు. ఈ విషయంలో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీకు దయ చాలా ఎక్కువ
అవతలి వారి మీద ప్రేమ భావం ఎక్కువగా ఉంటుంది. అందుకే అవతలి వారిని బాధపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఈ ప్రాసెస్ లో వేరే వారి కారణంగా మీరు బాధపడాల్సి వస్తుంది.