తాజాగా ‘గూగుల్ పే’ GPAY ని RBI నిషేధించిందన్నా వార్త తెగ వైరల్ అయిపోతోంది. దీని కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సంబంధించి కొన్ని ట్వీట్లు ట్విట్టర్‌లో వైరల్ గా మారిపోతున్నాయి. GPay ను రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) నిషేధించిందని అని వస్తున్నాయి.
దీనిలో నిజం ఎంత అనేది చూస్తే.. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తీవ్రంగా దర్యాప్తు చేశారు. అయితే చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్ నుండి వచ్చిన విషయం ప్రకారం.. GPay ద్వారా చెల్లించే అన్ని చెల్లింపులు సురక్షితమైనవని, ఆర్‌బిఐ పర్యవేక్షణలో జరుగుతున్నాయని పేర్కొంది.
ఇది కేవలం ఫేక్ న్యూస్. దీనిలో ఏ మాత్రం నిజం లేదు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను నడపడానికి , యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) ని అభివృద్ధి చేయడానికి ఎన్‌పిసిఐ పనిచేస్తుంది. GPay, ఫోన్‌పే , పేటీఎం వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చెల్లింపుల కోసం యుపిఐ ఉపయోగించబడుతుంది.
ఇది ఇలా ఉండగా భారతదేశంలో GPay నిషేధించలేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) స్పష్టం చేసింది. అయితే #GPayBannedByRBI పేరిట వస్తున్న దానిలో నిజం లేదు గమనించండి. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ ఫేక్ సమాచారాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. కానీ ఇది వట్టి ఫేక్ మెసేజ్ ఆర్‌బిఐ GPayను నిషేధించలేదు.