రాష్ట్ర అవతరణ వేడుకలకు భారీ ఏర్పాట్లు.. సీఎస్‌ సమీక్ష

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు చేస్తున్నది. జూన్‌ 2న రాష్ట్రంలోని పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలపై శుక్రవారం బీఆర్కేభవన్‌లో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌. వేడులకు సకాలంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

CS Somesh Kumar faces HC wrath for not obeying its orders

జూన్‌ 2న ఉదయం సీఎం కేసీఆర్‌ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, ఆ తర్వాత పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించాక సీఎం ప్రసంగిస్తారని చెప్పారు. సాయంత్రం 30 మంది ప్రముఖ కవులతో రవీంద్రభారతిలో కవిసమ్మేళనం ఉంటుందని తెలిపారు సోమేశ్‌కుమార్‌. ఈ సందర్భంగా వివిధ జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల జాబితాను విడుదలచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కే తారకరామారావు, కామారెడ్డిలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారని సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news