అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు.. సమాజ్‌వాది పార్టీకి ఆ సత్తా లేదు!

-

యూపీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి పరాజయం మిగిలింది. అజంగఢ్, రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడంతో ఆ రెండు స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ చేతిలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు బీజేపీకి కైవసం కావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. అయితే ఈ క్రమంలో సమాజ్‌వాది పార్టీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అసదుద్దీన్ ఓవైసీ
అసదుద్దీన్ ఓవైసీ

ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీని ఓడించే సత్తా సమాజ్‌వాది పార్టీకి లేదని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అలాగే మైనార్టీలు అలాంటి అసమర్థ పార్టీకి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. యూపీలోని రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందన్నారు. యూపీలో బలపడేందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. బీజేపీకి ఎంఐఎం టీమ్ మద్దతు ఇస్తోందని సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయన్నారు. మైనార్టీ ఓట్లు చీలిపోతే బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పారని, కానీ ఈ గెలుపునకు ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news