Asia Cup 2022 : ఇవాళ హాంకాంగ్ తో మ్యాచ్.. జిమ్ లో కష్టపడుతున్న కోహ్లీ

-

ఆసియా కప్ లో భాగం గా ఇవాళ ఇండియా మరియు హాంకాంగ్‌ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఉత్కంఠ పోరు కావడంతో ఇప్పటికే… ఈ మ్యాచ్ పై బెట్టింగులు స్టార్ట్ అయ్యాయి.

ఇక హాంకాంగ్ తో మ్యాచ్ నేపథ్యంలో కసరత్తులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జిమ్ లో గంటపాటు కసరత్తులు చేసిన కోహ్లీ దానికి సంబంధించిన ఫోటోలను స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశాడు. “హాంకాంగ్ తో మ్యాచ్ కూ సిద్ధం”, అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక అంతకుముందు పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన అనంతరం పాకు పెసర్ హరీష్ రౌఫ్ కు తన జెర్సీని గిఫ్టుగా ఇచ్చాడు. ఈ చర్యతో కోహ్లీ అభిమానుల మనసులు కూడా గెలుచుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news