నిన్నటితో ముగిసిన ఆసియా కప్ టోర్నమెంట్ లో ఇండియా టీం కమాండ్ ముగిసింది అని చెప్పాలి. కేవలం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ మినహాయితే, ఓటమి ఎరుగకుండా టైటిల్ ను దక్కించుకుని ఎనిమిది టైటిల్స్ ను ఇండియా తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈ ఆసియా కప్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో బెస్ట్ టీం అఫ్ ది టోర్నమెంట్ ను ఎంపిక చేయడం జరిగింది. ఈ టీం లో ఇండియా నుండి మొత్తం ఆరుగురు ప్లేయర్స్ కు చోటు దక్కడం విశేషం. అందులో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ , శుబ్మాన్ గిల్, కె ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ మరియు మహమ్మద్ సిరాజ్ లకు చోటు దక్కడం విశేషం. ఇక కోహ్లీ ఈ జట్టులో చోటును దక్కించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. శ్రీలంక నుండి కుషాల్ మెండిస్, చరిత్ అసలంక మరియు దునిత్ వెల్లలాగే కు చోటు దక్కింది..
ఇక బంగ్లాదేశ్ నుండి కెప్టెన్ షకిబుల్ హాసన్ కు మాత్రమే ఈ అవజాసం దక్కింది.. పాకిస్తాన్ లోనూ ఓపెనింగ్ స్టార్ బౌలర్ షహీన్ ఆఫ్రిది మాత్రమే తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు.