BREAKING : తెలంగాణ‌కు మ‌రో రూ. 600 కోట్ల భారీ పెట్టుబ‌డి

-

తెలంగాణ‌కు దేశీయ, అంతర్జాతీ పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణ‌లో రూ. 600 కోట్ల భారీ పెట్టుబ‌డి పెట్ట‌బోతోంద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించేందుకు సంతోషిస్తున్నాన‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పెట్టుబ‌డి ద్వారా 300 మందికి పైగా ప్ర‌త్య‌క్ష ఉపాధి ల‌భించ‌నుందని తెలిపారు. ప‌రోక్షంగా చాలా మంది ఉపాధి ల‌భించ‌నుంద‌ని వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండటం వల్లే వాటి ప్రవాహం కొనసాగుతోందని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news