ఆకట్టుకుంటున్న సుమంత్ బొర్ర,రాఘవ్ ఆదిత్ ల ప్రైవేట్ సాంగ్..!!

-

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా సమాజంలో టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు విరివిగా లభిస్తున్నాయి. అలాగే ప్రస్తుత యంగ్ జనరేషన్ నుండి ఆకట్టుకొనే అనేక ప్రైవేట్ సాంగ్స్ వస్తున్నాయి. ఇక దిగ్గజ మ్యూజిక్  సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు కూడా మంచి టాలెంట్ ఉన్న యువతను కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. అలాంటి వారిలో సుమంత్ బొర్ర ఒకరు.గతంలో తాను పాడిన అధ్బుతమైన సాంగ్స్  ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యి ఆకట్టుకుంటున్నాయి.

అలాగే ప్రస్తుతం సుమంత్ బొర్ర నిర్మాత గా వ్యవహరించి స్వయంగా పాడిన విశ్వం రిప్రైస్ సాంగ్ కూడా అందరి మన్ననలు పొందుతోంది.ఈ రోజుల్లొ  అందరూ అమ్మ యొక్క సేవలను మరచి పోతున్నారు. ఈ సృష్టిలో దేవుని తో సమాన మైన విలువ గల వ్యక్తి అమ్మ. ఆమె నిస్వార్థంగా మన అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. ఇదే కాన్సెప్ట్ ను తీసుకొని సుమంత్ బొర్ర స్వయంగా రాసి అద్భుతంగా పాడటం జరిగింది.

ఈ పాటకు రాఘవ్ ఆదిత్  సూపర్ మ్యూజిక్ అందించారు. సినిమాల్లో పాటకు తగ్గకుండా ఈ పాటకు సంగీతం ఇచ్చారు. అలాగే జీబారిన్ గారు మంచి వీడియో ఎడిటింగ్ తో పాటను ఆకట్టుకునేలా చేశారు. ఈ రోజుల్లో అర్దం లేని పాటలు వచ్చి వినే వారిని ఇబ్బంది పెడుతున్నాయి. కాని ఇలాంటి మంచి పాటలు పాటలు మరిన్ని రావాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ఇక ముందు కూడా ప్రేక్షకులను అలరించే మరిన్ని మంచి పాటలతో వస్తామని కాన్ఫిడెన్స్ తో చెబుతోంది సుమంత్ బొర్ర బృందం.

 

Read more RELATED
Recommended to you

Latest news