AUS VS SA : కెప్టెన్ బావుమా ఒక్కడే నిలిచాడు (114*) … !

-

ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు ఆడనుంది. ఇప్పటికే ముగిసిన టీ 20 సీరీస్ ను ఆస్ట్రేలియా కైవశం చేసుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా టార్గెట్ వన్ డే సీరీస్ పైన పడింది. అందులో భాగంగా మొదటి టీ 20 బ్లోం ఫౌంటైన్ లో జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. బదులుగా మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా మాత్రం ఎంతో నిదానంగా ఆడుతూ జట్టు స్కోర్ ను పెంచుతూ వచ్చాడు. ఇంపార్టెంట్ ప్లేయర్ లుగా చెప్పుకునే డికాక్, దస్సేన్, మార్కురామ్, క్లాజెన్ , మిల్లర్ ఇలా అందరూ ఆచి తూచి ఆడకుండా వికెట్లను పారేసుకున్నారు. బావుమా చాల సంయమనంతో ఆడి చివరి వరకు క్రీజులో నిలబడి సెంచరీ సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను సాధించి పెట్టాడు. సౌత్ ఆఫ్రికా 49 ఓవర్ ల పాటు ఆడి 222 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

కెప్టెన్ బావుమా 114 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అస్ట్రేలియా బౌలర్లలో హాజిల్ వుడ్ మూడు మరియు స్థాయినిస్ 2 వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version