ఐర్లాండ్‌పై ఆసిస్‌ ఘన విజయం.. సూపర్‌ 12లో రెండోస్థానానికి

-

టీ20 ప్రపంచకప్ 2022లో ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా సమష్టి ప్రదర్శన కనబరిచింది. ఐర్లాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా 42 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసిన ఆసీస్ జట్టు… ఆపై ఐర్లాండ్ ను 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ చేసింది. ప్యాట్ కమిన్స్, మ్యాక్స్ వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు సాధించగా, స్టొయినిస్ 1 వికెట్ తీశాడు.

Australia vs Ireland Highlights, T20 World Cup 2022: Aaron Finch, bowlers  power AUS to 42-run victory vs IRE in Brisbane | Hindustan Times

ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ లొర్కాన్ టకర్ ఒంటరిపోరాటం చేశాడు. టకర్ 48 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. టకర్ చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ అతడికి ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం కరవైంది. కాగా, ఈ విజయంతో ఆస్ట్రేలియా సూపర్-12 గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ఎగబాకింది. ఆసీస్ ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news