Avatar2: సినీలవర్స్‌కు గుడ్ న్యూస్..అవతార్2 రిలీజ్ డేట్ ఫిక్స్!

-

హాలీవుడ్ ఫిల్మ్ ‘అవతార్’ గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎవరైనా ఈ పిక్చర్ చూస్తే చాలు ఫిదా అయిపోవాల్సిందే. అటువంటి గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్ అందించిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో ఆ చిత్రానికి సీక్వెల్ ‘అవతార్ 2’ ఎప్పుడొస్తుందా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినిమా లవర్స్.

ఈ క్రమంలోనే తాజాగా ‘అవతార్ 2’కు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వార్తల ప్రకారం.. డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మరోసారి ఆ సినిమాతో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు. నెట్టింట వస్తు్న్న వార్తల ప్రకారం.. అవతార్ 2 ఈ ఏడాది డిసెంబర్ 16న థియేటర్స్ లో విడుదల కాబోతుందట.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 160 భాషల్లో పిక్చర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే నెల 6న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అవుతుందని సమాచారం. అవతార్ సినిమా వచ్చి 13 ఏళ్లు అయింది.

ఇన్నేళ్లకు అవతార్ సీక్వెల్ ‘అవతార్ 2’ రాబోతుండటం పట్ల సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపున ఈ పిక్చర్ అవతార్ ను మించి ఉంటుందని అందరూ అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version