మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన పాత్రుడు

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే ఇటీవల మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి వెనుకాల గోడను ఇరిగేషన్‌ అధికారులు కూల్చివేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు మరోసారి అయ్యన్నపాత్రుడు వైసీపీ నేతలను విమర్శలు గుప్పించారు. న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో బతగ్గలుగుతున్నామని, లేదంటే తమలాంటి వారిని కొట్టి చంపేసి ఉండేవారని అయ్యన్నపాత్రుడు అన్నారు.

Andhra Pradesh: Case filed against TDP leader Ayyanna Patrudu over indecent  remarks against chief minister

పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అయ్యన్నపాత్రుడు. తమను భయపెట్టి లొంగదీసుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో కొట్టించినట్టు తనను కూడా కొట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు అయ్యన్నపాత్రుడు. అందుకోసమే శని, ఆదివారాల్లో పోలీసులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని అన్నారు అయ్యన్నపాత్రుడు. ఆ రెండు రోజుల్లో కోర్టుకు సెలవు కాబట్టి ఏం చేయలేరని భావిస్తున్నారని అన్నారు అయ్యన్నపాత్రుడు.

వైసీపీ వాళ్లకు వాళ్ల భాషలో మాట్లాడితేనే అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడాల్సి వస్తోందన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పరువు తీశానని కొత్తగా తనపై మరో కేసు పెట్టారని, భయపెట్టి గొంతు నొక్కేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యన్నపాత్రుడు. తనను అరెస్ట్ చేయాలంటే కేసు నమోదు చేయాలని, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని, దానిని ఆన్‌లైన్‌లోనూ పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు అయ్యన్నపాత్రుడు. నిబంధనలు పాటించకుండా ఇంటి కొస్తే కాపాడేందుకు కోర్టులు ఉన్నాయని, భగవంతుడు కూడా ఉన్నాడని చెప్పుకొచ్చారు అయ్యన్నపాత్రుడు.

 

Read more RELATED
Recommended to you

Latest news