వర్రా రవీందర్ రెడ్డికి YCP నుంచే ప్రాణ హాని ఉంది – బీటెక్ రవి

-

వర్రా రవీందర్ రెడ్డికి YCP నుంచే ప్రాణ హాని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీటెక్ రవి. వర్రా రవీంద్ర రెడ్డికి ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో విడుదల చేశారు పులివెందుల టీడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి. వర్రా రవీంద్ర రెడ్డి విషయం లోభారీ కుట్ర కోణం జరుగుతోందని… వర్రా రవీంద్ర రెడ్డి అరెస్టు అయ్యాడని ఒకసారి, అరెస్టు కాలేదని మరోసారి వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని ఆగ్రహించారు. వారే అతనికి ప్రమాదం సృష్టించి ఆ నెపం టిడిపి పై వేయడానికి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

btech ravi on varra

అతని ప్రాణానికి హాని చేసి ఆ నెపం ఆంద్ర పోలీసులు పైన టిడిపి పైన వేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. వర్రా రవీంద్ర రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పి ఇప్పుడు లేడు అని చెప్తున్నారన్నారు. అతని ప్రాణానికి ముప్పు ఉందని మా అభిప్రాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాఘవ రెడ్డి కి,వర్రా రవీంద్ర తో కంటిన్యూగా టచ్ లో ఉన్నాడని.. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బీటెక్ రవి. వర్రా ను తొందరలో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పెట్టాలని డిమాండ్‌ చేశారు బీటెక్ రవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version