అల్లోపతిపై బాబా రాందేవ్ వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో విచారణ నేడే.

-

బాబా రాందేవ్.. ప్రఖ్యాత యోగా గురువు. పతంజలి పేరుతో ఎన్నో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే కరోనా సెకమండ్ వేవ్ సమయంలో అల్లపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అల్లోపతి వైద్యం వల్లే ఎంతోమంది రోగులు చనిపోయారని, దానంతటికీ కారణం అల్లోపతిలో అసలైన వైద్యం లేదని కామెంట్లు చేసారు. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అనేక ఒత్తిళ్ళ మేరకు బాబా రాందేవ్, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.

ప్రస్తుతం బాబా రాందేవ్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బాబా రాందేవ్ మాట్లాడిన అసలు రికార్డును నేడు పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే తాను చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న దర్యాఫ్తును నిలిపివేయాలని రాందేవ్ బాబా వ్యాజ్యం వేసారు. మరి విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. అల్లోపతిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన అనంతరం, అల్లోపతిలో అన్ని రోగాలకి వైద్యం ఉందా అంటూ 25రకాల ప్రశ్నలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news