బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌కు బెయిల్ మంజూరైంది. 10 వేల పూచీకత్తు, 2 ష్యూరిటీలతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని నందకుమార్‌ను ఆదేశించింది. ఈ మేరకు చంచల్‌గూడ జైలు నుంచి నందకుమార్ విడుదలయ్యారు. ఆ తర్వాత నందకుమార్‌కు చంచల్ గూడ జైల్ నుండి విడుదలయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్, రామచంద్రభారతి, సింహాయాజీలకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో కేసులో నందకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నందకుమార్‌కు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా.. భూ అక్రమ దందాలు చేస్తూ నందకుమార్ మధ్యవర్తిగా ఉండేవాడు. దీంతో బాదితుల ఫిర్యాదుతో గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో అరెస్టైన నందకుమార్ కు ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా..నందకుమార్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నగరం విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా.. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో.. కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తులను సమర్పించడంతో చంచల్ గూడ జైలు నుండి నందకుమార్ ఇవాళ విడుదలయ్యాడు.