సుంకే రవిశంకర్‌పై కాంగ్రెస్‌ చార్జిషీట్‌.. ఎస్సై, సీఐ పోస్టుల పేరుతో లక్షల్లో వసూలు

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత అయిన సుంకే రవిశంకర్ పై ఓ చార్జిషీట్ రూపొందించారు. సీఐ, ఎస్సై పోస్టుల పేరుతో రవిశంకర్ లక్షల్లో డబ్బులు తీసుకున్నారని ఆరోపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇలా అమాయకుల దగ్గర దోచుకున్న డబ్బుతో రవిశంకర్ ఖరీదైన అపార్ట్-మెంటులు కట్టాడని తెలిపింది.జాతీయ రహదారుల వెంబడి కోట్ల విలువ చేసే స్థలాలు రవిశంకర్ కొన్నారని కాంగ్రెస్ పార్టీ తన చార్జిషీట్ లో పేర్కొంది.

ఇది కాక నారాయణపూర్ లోని రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ముంపు బాధితులను కూడా రవిశంకర్ ఆదుకోలేదని వెల్లడించింది. పదవులు ఇప్పిస్తానంటూ సొంత పార్టీ నేతల దగ్గర కుడా చాల డబ్బులు తీసుకున్నారని తెలిపింది. ఆఖరికి తన కూతురి పెళ్లి చేస్తూ ఎంపీటీసీలు, సర్పంచుల నుంచి కూడ డబ్బు వసూలు చేశాడని కాంగ్రెస్ పార్టి తన చార్జిషీట్ లో వ్యక్తపరిచింది. 2018 నుంచి రవిశంకర్ కోట్లకు పడగలెత్తారని పేర్కొంది.

బీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై కాంగ్రెస్ పార్టీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం సిరిసిల్ల జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెనుకబడిపోతోందన్నారు. 500 కోట్లతో రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారని.. ముంపు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామన్న హామీని గాలికొదిలేశారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటికి కటకట వున్నా దానిపై దృష్టి పెట్టడం లేన్నారు. బాలికలకు జూనియర్ కాలేజ్ లేదని, డిగ్రీ కాలేజ్ లేదని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news