కాగా హైవే కిల్లర్ మున్నా కేసు ప్రకాశం జిల్లాలో సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేసు ప్రధాన నిందితుడు మున్నాతో పాటు 12 మందికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవితై ఖైదు ఖరారు చేసింది. 13 ఏళ్ల క్రితం హైవేలపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను హత్య చేసింది మున్నా గ్యాంగ్. 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. జాతీయ రహదారిపై లారీలు ఆపి 13మంది డ్రైవర్లు, క్లీనర్లని హత్య చేసింది ఈ గ్యాంగ్. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు ఎత్తుకెళ్లేవారు. ఈ హత్య కేసుల్లో 18 మందిని దోషులుగా ఒంగోలు కోర్టు నిర్ధారించింది. దీంతో A17 నిందితుడు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. లాయర్ వాదనలు విన్న హైకోర్టు అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మొన్న మరణ శిక్ష.. నేడు బెయిల్ .. మున్నాగ్యాంగ్ కేసులో ఊరట
-