లోకేష్‌ని తగులుకున్న బైరెడ్డి..ఆ ముద్రపోయేలా!

-

వైసీపీ యువనేతల్లో మంచి క్రేజ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి..రాజకీయమే సెపరేట్ గా ఉంటుంది..జగన్‌ని పొగిడే విషయంలో ముందుటారేమో గాని..పెద్దగా ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ. శాప్ పదవి వచ్చాక కూడా ఈయన..చంద్రబాబు, లోకేష్ టార్గెట్‌గా పెద్దగా విమర్శలు చేయలేదు. అయితే తాజాగా బైరెడ్డి దూకుడు పెంచారు..లోకేష్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.

రాష్ట్రంలో క్రీడా వికాస కేంద్రాల(కేవీకే)పై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ..లోకేష్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, కేవీకేలని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని, టి‌డి‌పి హయాంలో కాంట్రాక్టర్లకు లబ్ది చేకూరేలా కేవీకేలని గుట్టల్లో, శ్మశాన వాటికల్లో నిర్మించారని బైరెడ్డి ఫైర్ అయ్యారు. దొంగ అంచనాలతో కోటి అయ్యే భవనానికి రెండు కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. గతంలో కొన్ని స్టేడియాల్లో క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేసేవారని అన్నారు. ఇక తమ హయాంలో క్రీడాకారులకు సపోర్ట్ గా ఉంటున్నామని, 6 వేల జగనన్న స్పొర్ట్స్ క్లబ్బులు ఏర్పాటు చేశామని చెప్పారు.

అయితే ఇంతకాలం తన పదవికి సంబంధించిన అంశాలపై బైరెడ్డి పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో బైరెడ్డి ఘాటుగా స్పందించారు..అది కూడా లోకేష్ టార్గెట్ గా బైరెడ్డి ఫైర్ అయ్యారు. ఇలా లోకేష్‌ని టార్గెట్ చేయడానికి కారణాలు లేకపోలేదు. ఆ మధ్య బైరెడ్డి టీడీపీలో చేరబోతున్నారని, లోకేష్‌ని కలిశారని వార్తలు కూడా వచ్చాయి.

ఈ వార్తలని బైరెడ్డి ఖండించారు కూడా..అయినా సరే బైరెడ్డిపై అనుమానాలు ఉన్నాయి. టి‌డి‌పి అధికారంలో ఉండగా ఈయన ఆ పార్టీలో చేరడానికి చూశారు. అందుకే ఆయనపై అనుమానాలు ఉన్నాయి. ఇలా టి‌డి‌పి చేరుతున్నామనే అపవాదు తొలగించడం కోసమే బైరెడ్డి..లోకేష్‌ని టార్గెట్ చేశారని అర్ధమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా బైరెడ్డి లోకేష్‌ని టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version