BalaKrishna: “అన్‌స్టాప‌బుల్” స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన బాల‌య్య‌.. ఆరుప‌దుల వ‌య‌స్సులో ఇలా ఏలా?

-

BalaKrishna: నంద‌మూరి న‌ట సింగం బాల‌య్య .. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు రియాలిటీ షోలతో తెగ సంద‌డి చేస్తున్నారు. ఆరుప‌దుల వ‌య‌స్సులో కూడా పుల్ జోష్ లో క‌నిపిస్తున్నారు. యంగ్ హీరోల‌కు ధీటుగా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వరుస ప్రాజెక్ట్స్‏ను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తు్న్నారు. ప్రస్తుతం బాల‌య్య..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు ఓటీటీలో హోస్ట్ గా మారి ర‌చ్చ చేస్తున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ ఆహా వేదికగా..అన్‌‏స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ప‌లువురు ప్రముఖుల‌ని త‌న‌దైన స్టైల్‌లో ఇంట‌ర్వ్యూలు చేస్తూ.. పుల్ ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు. తొలి ఎపిసోడ్‌ను మంచు ఫ్యామిలీపై బాల‌య్య తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు .

ఇక రెండో ఎపిసోడ్‏లో గెస్టుగా న్యాచురల్ స్టార్ నాని రానున్న విష‌యం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట్లో హ‌ల్చల్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ నవంబర్ 12న స్ట్రీమింగ్ కానుంది.

అయితే తాజాగా బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షో వేదిక‌పై చిందులు వేసిన వీడియోని ఆహా విడుద‌ల‌చేసింది. అందులో హీరోయిన్ పూర్ణతో కలిసి బాలకృష్ణ ఫుల్ జోష్‏లో డ్యాన్స్ చేశారు. నందమూరి నాయక..పాటకు ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశాడు బాలకృష్ణ. ఈ వీడియో చూస్తూంటే… బాలకృష్ణకు 61 యేండ్లు అంటే న‌మ్మ‌బుద్ది కావ‌డం లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. బాలయ్య జోరు.. కుర్రహీరోలు బేజారు అంటూ అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news