బాలానగర్ డ్రగ్స్ కేసు అప్డేట్.. లొంగిపోయిన నిందితులు..!

-

బాలానగర్ డ్రగ్స్ కేసులో ఎల్బీ నగర్ కోర్ట్ లో నిందితులు లొంగిపోయారు. గతంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ సాయి కుమార్ నుండి బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సాయి కుమార్ కు డ్రగ్స్ ను సప్లై చేసిన నిందితులు రామకృష్ణ గౌడ్ , హనుమంత రెడ్డి లు తాజాగా పోలిసుల ఎదుట లొంగిపోయారు. దాంతో ఇద్దరు డ్రగ్స్ నిందితులను మూడు రోజులు పాటు ఎక్సైజ్ పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారు. అంతే కాకుండా చింతల్ లోని గణేష్ నగర్ లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను టార్గెట్ గా చేసుకొని రామకృష్ణ గౌడ్ హనుమంత్ రెడ్డి డ్రగ్స్ , గంజాయి ని సప్లై చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ఇటీవల తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి ని అరికట్టేందుకు దాడులు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version