ఎడిట్ నోట్: బాలయ్య-పవన్ పోలిటికల్ కాంబో.!

-

ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. మామూలుగా సినీ ఇండస్ట్రీలో రాజకీయాలతో సంబంధం ఉన్న వారు చాలామంది ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో నటులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదొక పార్టీకి సపోర్ట్ చేస్తున్న వారే. అయితే సినీ ఇండస్ట్రీలో దిగ్గజ హీరోలుగా ఉన్న బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ‌ఏపీ రాజకీయాల్లో కూడా కీలకంగా ఉన్నారు.  టీడీపీ ఎమ్మెల్యేగా బాలయ్య ఉన్న విషయం తెలిసిందే. అటు జనసేన అధినేతగా పవన్ ఉన్నారు.

అయితే ఎప్పటినుంచో ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతుంది..ఆ మేరకు అటు చంద్రబాబు, ఇటు పవన్ నుంచి పొత్తుపై సానుకూల వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్-బాబు కలిసిన విషయం తెలిసిందే. కాకపోతే పొత్తుపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ముందు వైసీపీ అరాచక పాలనపై కలిసి పోరాడతామని చెప్పారు. పొత్తులు ఎన్నికల ముందు చూసుకుంటామని అన్నారు. ఇక పవన్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని, ఎట్టి పరిస్తితుల్లోనూ వైసీపీన్ ఓడిస్తామని అంటున్నారు.

వీరసింహారెడ్డితో హరిహర వీరమల్లు అంటూ ఫ్యాన్స్ రచ్చ

ఇలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అనూహ్యంగా  బాలయ్య-పవన్ కలవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వీరు కలిసింది సినిమా షూటింగ్‌ల్లో తాజాగా..అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య వీరసింహారెడ్డి, పవన్ హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పవన్..బాలయ్యని వెళ్ళి కలిశారు.

తమ సినిమా బృందంతో వెళ్ళి..వీర సింహారెడ్డి సెట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా బాలయ్య-పవన్ మధ్య రాజకీయ పరమైన చర్చలు కూడా నడిచాయని తెలుస్తోంది. కానీ దీనిపై పూర్తి సమాచారం లేదు. కానీ వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందనే నేపథ్యంలో బాలయ్య-పవన్ కలవడం ఏపీ రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్ వచ్చిందని చెప్పవచ్చు. అలాగే త్వరలో బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రోగ్రాంకు పవన్ వస్తున్నారని కూడా తెలుస్తోంది. అయితే బాలయ్య-పవన్ కాంబినేషన్ సినీ ఇండస్ట్రీలోనే కాదు..పోలిటికల్ రంగంలో కూడా సంచనలంగా మారిందని చెప్పవచ్చు. వీరి కాంబో టీడీపీ-జనసేనలకు కొత్త ఊపుని తీసుకొస్తుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news