ఉగాది పండుగ..బాలయ్య కీలక ప్రకటన

-

ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరికీ క్రోది నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు నందమూరి బాలకృష్ణ. తెలుగువారి సంవత్సరాది ఉగాది సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పారు.

balayya on uagdi

ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కల్పించాలి.మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉండాలని కోరారు నందమూరి బాలకృష్ణ. తెలుగువారి అస్తిత్వానికి చిరునామాగా నిలిచే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి జీవితం వసంత రుతువులో చిరుగులా చిగురించాలన్నారు నందమూరి బాలకృష్ణ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version