అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు వరుసగా హిట్ కొట్టడం, ఇటు షోతో సక్సెస్ బాటలో ఉన్నారు. ఇక అన్‌స్టాపబుల్ షో పలు సంచలనాలకు అడ్రెస్ గా మారింది. ఇప్పటికే ప్రభాస్ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇక పవన్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే పవన్ ఎపిసోడ్ పార్ట్ 1 వచ్చింది..అందులో సినీ రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవ్వగా, తాజాగా రాజకీయ రంగానికి సంబంధించిన ప్రశ్నలు పార్ట్ 2లో ఎదురయ్యాయి.
బాలయ్య ఆసక్తికరమైన ప్రశ్నలు అడగగా, పవన్ అంతే ఆసక్తికరంగా సమాధానాలు చెబుతూ వచ్చారు. తాజాగా బాలయ్య-పవన్ కాంబినేషన్ ఎపిసోడ్ 2 వైరల్ అవుతుంది. ఇందులో బాలయ్య..పోలిటికల్ ప్రశ్నలు అడిగి..పవన్‌కు ఓ రకంగా ఎలివేషన్లు ఇచ్చారని చెప్పవచ్చు. సినిమాల్లో పవర్ స్టార్‌గా ప్రతీ ఒక్కరూ అభిమానించే పవన్ కల్యాణ్‌కు ఆ అభిమానం ఓట్లుగా మారకపోవటం పైన బాలయ్య ప్రశ్నించారు.
దీనిపై సమాధానమిస్తూ..సినిమా అభిమానం వేరని..ఓటుగా మారటం వేరని పవన్ క్లారిటీ ఇచ్చారు. సినీ అభిమానం ఓటుగా మారాలని లేదని, రాజకీయాల్లోనూ అదే స్థాయిలో పేరు రావాలంటే అంతే కష్టపడాలని, రాజకీయాల్లో నిలబడి ఉండటం అవసరమని చెప్పారు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని, తాను ఇంకా నమ్మకం సంపాదించుకొనే స్థితిలోనే ఉన్నానని పవన్ క్లారిటీ ఇచ్చారు.
అటు టీడీపీ ఎందుకు చేరలేదని బాలయ్య ప్రశ్నించగా, తాను కాంగ్రెస్ లోనూ చేరలేదని, అప్పటికే ఉన్న పార్టీలకు సిద్దాంతాలు..లక్ష్యాలు ఉన్నాయని, తాను కొన్ని మూల సిద్దాంతాలతో రాజకీయాలతో కొనసాగుతున్నట్లు చెప్పారు. అటు ఇప్పటం ఇష్యూపై కూడా బాలయ్య-పవన్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. తన పార్టీ ఆవిర్భావ సభకు స్థలమిచ్చారనే ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేయించందని, తాను వారికి మద్దతుగా వెళ్తుంటే అడ్డుకొనే ప్రయత్నం జరిగిందని, ఇంకా తనకు తిక్క వచ్చిందని, అందుకే తాను కారు పైకి ఎక్కి కూర్చోవాల్సి వచ్చిందని వివరించారు. మొత్తానికి సెకండ్ ఎపిసోడ్ పూర్తిగా రాజకీయంగా నడిచింది.