యాదాద్రి ఒక అద్భుతం.. కేసీఆర్ పై బాలయ్య పొగడ్తలు

-

యాదాద్రి : అఖండ సినిమా యూనిట్ తో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు సినీహీరో బాలకృష్ణ. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సినీ హీరో బాలకృష్ణ,అఖండ చిత్ర యూనిట్ పరిశీలించింది.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని పేర్కొన్నారు.

ఇక్కడ పరిసరాలను కలుషితం చేయకుండా చేయాలని కోరారు బాలయ్య. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలల్లో అని పుణ్యక్షేత్రలను దర్శించుకున్నాం అందులో భాగంగానే యాదాద్రి దర్శనానికి వచ్చామని వెల్లడించారు. యాదాద్రి ఒక అద్భుతమని.. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉందన్నారు నందమూరి బాలకృష్ణ. ఇలాంటి అభివృద్ది పనులను.. ఎవరు చేసినా అభినందించాలని పేర్కొన్నారు బాలయ్య. ఇలాంటి అభివృద్ది పనులను సిఎం కెసిఆర్ ఇంకా ఎన్నో చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news