రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ట్వీట్ చేశారు. కేసీఆర్ దెబ్బ – మోడీ అబ్బ అంటూ ట్వీట్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా సెగ ఢిల్లీకి తాకిందని… ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తాం అని చెప్పిన కేసీఆర్ గారి మాటలకు ఢిల్లీ మైండ్ బ్లాక్ అయిందని చురకలు అంటించారు బాల్క సుమన్. ఇవాళ వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించడమే కాకుండా…రైతులకు క్షమాపణలు చెప్పాడని గుర్తు చేశారు బాల్క సుమన్.
”కేంద్రం తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనే వరకు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతుల తరపున పోరు కొనసాగుతూ ఉంటుంది.నేడు దేశ రైతంగంపై కేంద్ర బిజెపీ సర్కార్ తీసుకుంటున్న రైతు వ్యతిరేఖ చట్టాలపై నిన్న కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన రైతు దీక్షతో కేంద్రం మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.ఉద్యమ ధీరుడు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి మరో అద్భుత విజయం. నాడు స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్షచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించారు. ” అంటూ బాల్క సుమన్ పేర్కొన్నారు.
#కేసీఆర్ దెబ్బ – మోడీ అబ్బ
ఇందిరా పార్క్ ధర్నా సెగ ఢిల్లీకి తాకింది
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తాం అని చెప్పిన కేసీఆర్ గారి మాటలకు ఢిల్లీ మైండ్ బ్లాక్ అయింది.
— Balka Suman (@balkasumantrs) November 19, 2021