NZ VS BAN :మిర్పూర్ వన్ డే లో బ్యాటింగ్ చేయనున్న కివీస్ !

-

ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు మూడు వన్ డే ల సిరీస్ ను ఆడడానికి బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే, అందులో భాగంగా ఈ రోజు మిర్పూర్ లో మొదటి వన్ డే జరగనుంది .. వర్షం పడే అవకాశం ఉన్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్ కు ఆసియా కప్ లో బంగ్లాను లీడ్ చేసిన షకిబుల్ హాసన్ దూరం అయ్యాడు. కాగా మొదట ఫెర్గుసన్ సారధ్యంలోని న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ తో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బల్ తుది జట్టులో ఆడనున్నాడు. దాదాపుగా ఒక్క మార్పు తప్ప ఆసియా కప్ లో ఇండియా తో ఆడిన జట్టునే బంగ్లా ఆడిస్తోంది.. ఇక కివీస్ జట్టులోనూ కుర్రాళ్లే ఎక్కువగా ఉండడం విశేషం.. కేవలం ఇష్ సోధీ , బౌల్ట్ , ఫెర్గుసన్ మినహా అందరూ అనుభవం లేనివాళ్లే.

మరి మొదటి వన్ డే లో ఎవరు బోణీ కొడతారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఫేవరెట్ ఎవరని చూస్తే మాత్రం.. ఖచ్చితంగా బంగ్లాదేశ్ అని చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version