317జీఓతో భార్య భర్తలను, తల్లి పిల్లలను విడగొట్టిన మూర్ఖుడు : కేసీఆర్‌ కు బండి సంజయ్‌ కౌంటర్‌

-

తెలంగాణలో పెద్ద వైరస్..మిడత దండు అంటూ సీఎం కేసీఆర్‌ కు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తానని చెప్పిన రైతు ద్రోహివి అంటూ నిప్పులు చెరిగారు. దాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని.. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిచ్చిందే నీవే అంటూ మండిపడ్డారు. ఫ్రీ యూరియా ఇస్తా అని హామీ ఇచ్చావు కదా.. ఇచ్చావా..? అని ప్రశ్నించారు. 317జీఓ మంచిదే అయితే 10 మంది ఎందుకు చనిపోయారని ఆగ్రహించారు.

భార్య భర్తలను, తల్లి పిల్లలను విడగొట్టిన మూర్ఖుడని.. ని కొడుకు, కూతురు మాత్రం ఒకే దగ్గర ఉండాలా అని ఫైర్‌ అయ్యారు. 124 జీఓ వచ్చి ఎంత కాలం అవుతుంది.. ఇన్ని రోజులు నీముడ్డి కింద పెట్టుకున్నవా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏది..ప్రతి ఎన్నిక సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటివి… ఆ పాపము ఉట్టిగా పోదన్నారు. కేసీఆర్‌ వి అన్ని బుడ్డరు ఖాన మాటలేనని.. కరోనా సమయంలో నీవు పీకింది ఏంది అని ఫైర్‌ అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మక్కు అయ్యావు… భారత్ బయో టెక్ కి ఒక్కసారి అయినా వెళ్ళావా అని నిలదీశారు. నిన్ను జైలుకు పంపడం ఖాయమని.. దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version