కేసీఆర్‌ భారతీయుడేనా..డీఎన్‌ఏ పరీక్షలు చేయాలి : బండి సంజయ్‌

-

భారతీయుడైతే క్షమాపణలు చెప్పాలి..లేకపోతే కేసీఆర్‌ దేశ ద్రోహే అని బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జవాన్ల త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడటం దేశద్రోహమేనని, కేసీఆర్‌ నిజమైన భారతీయుడైతే వెంటనే క్షమాపణ చెప్పాలి.. తమపై దాడి జరిగిందని పాకిస్థాన్‌ ఒప్పుకుంటే, కేసీఆర్‌ మాత్రం ఒప్పుకోరా? అని నిలదీశారు బండి సంజయ్‌.

కేసీఆర్ చైనా మీద బాగా ప్రేమ చూపుతున్నాడని.. సీఎం కి ఏమి పుట్టిందో అర్థం కావడం లేదు… నిస్సిగ్గుగా వీర సైనికుల త్యాగాలను కించ పరిచే గా మాట్లాడారు.. కేసీఆర్ అంత దేశ ద్రోహి ఎవరు లేరని నిప్పులు చెరిగారు. ఆయన ఇక్కడే పుట్టాడా… dna టెస్ట్ చేయించాలి… ఏ దేశానికి వంత పాడుతున్నారని.. మసూద్ అజహర్ చెబితే కేసీఆర్ నమ్ముతాడట అంటూ ఆగ్రహించారు.

దేశం పై జరిగిన అనేక ఉగ్ర దాడులకు కారణం మసూద్ అజహర్ అని.. కేసీఆర్ నీవు భారతీయునివి అయితే వెంటనే క్షమాపణ చెప్పు అని డిమాండ్‌ చేశారు. తెలంగాణ యువత సీఎం వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా… రాజకీయ విమర్శలు చెయ్యి… సైనికుల ను అవమానిస్తావా ? అంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కి స్క్రిప్ట్ 10 జన్ పథ్ నుండి వస్తుందని.. రాఫెల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది… అవినీతి జరగలేదని చెప్పింది… కేసీఆర్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news