రాజ్యసభకు రాజమౌళి తండ్రి.. బండి సంజయ్‌ ఏమన్నారంటే..?

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిన్న హైదరాబాద్ లో ప్రకటన ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజా, మాజీ ఒలింపిక్ క్రీడాకారిణి పీటీ ఉష, ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్, ఆధ్యాత్మిక, సామాజికవేత్త వీరేంద్ర హెగ్డే రాజ్యసభకు నామినేట్ కావడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చి తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభా పాటవాలు కనబరుస్తూ భారతీయులకు ప్రేరణ కలిగిస్తున్న ఇళయరాజా, పీటీ ఊష, విజయేంద్రప్రసాద్, వీరేంద్రహెగ్డేలను రాజ్యసభకు నామినేట్ చేయడం మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు.

గతంలో సంపన్నులకు, పైరవీ కారులకే అత్యుతన్నమైన పద్మ అవార్డులు దక్కేవని, రాజ్యసభకు నామినేట్ చేసే వారనే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ… ఊహకే అందని విధంగా అతి సాధారణ కుటుంబ నేపథ్యం కలిగి తమ తమ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ఎంతోమందికి పద్మ అవార్డులు అందించిన ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన తెలిపారు. తాజాగా అదే కోవకు చెందిన నలుగురు దక్షిణాది వారిని సైతం రాజ్యసభ సభ్యులగా నామినేట్ చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలకు బీజేపీ తెలంగాణ శాఖ తరపున ధన్యవాదాలు. రాజ్యసభకు నామినేట్ అయిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు బండి సంజయ్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version