కేసీఆర్ మోదీకి లొంగిపోయాడు… కేంద్రం ఎన్నికల కోసమే రైతు చట్టాలను వెనక్కి తీసుకుంది.- రేవంత్ రెడ్డి

-

కేంద్రం యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పోరాటంతోనే కేంద్రం దిగివచ్చి రైతు చట్టాలను రద్దు చేసిందన్నారు. రైతుల పోరాటంతో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ మళ్లీ రైతు చట్టాలను తీసుకు వస్తామనడం చూస్తుంటే కేంద్రం ఎన్నికల కోసమే చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది అన్నారు. రైతు పండించిన పంటకు దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో వరికి రూ. 400 ఉన్న మద్దతు ధరను రూ. 1000 పెంచారని వెల్లడించారు. మోదీ ప్రభుత్వ కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ ప్రధాని మోదీకి లొంగిపోయారని విమర్శించారు. రైతు ఉద్యమంలో మరణించిన 700 పైగా రైతులకు రూ. 3 లక్షల నష్ట పరిహారం ఇస్తామన్న కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు కనీసం చనిపోయిన రైతుల వివరాలు కూడా తీసుకునేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు. కేసీఆర్ కు రైతుకు నష్టపరిహారం ఇవ్వడంలో చిత్తశుద్ది లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news