ఆరు కాదు.. నా తల 10 ముక్కలు నరుకు : కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

-

తెలంగాణ రాష్ట్రంలో.. గత మూడు రోజుల నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య ధాన్యం కొనుగోలు అంశంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దాన్యం కొనుగోలు అంశంలో బండి సంజయ్ వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లుగా వివాదం చెలరేగుతోంది. వరుసగా ప్రెస్మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

అయితే నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల 6 ముక్కలు కాదు నరుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన తల నరికిన పర్వాలేదని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ డేట్ చెప్తే ప్రగతి భవన్ కు వచ్చి తెలంగాణ ప్రజల కోసం తల నరికించి కుంటా అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. దళితుడు సీఎం అయ్యే అర్హత లేదా అని ప్రశ్నించారు. 24 రాష్ట్రాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించాయి ? కేసీఆర్ తగ్గించరా ? అని నిలదీశారు. పెట్రోల్ ధరలు తగ్గించకపోతే డప్పుల మోత ఇక ఆగదని హెచ్చరించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version