కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నమ్మి ఓట్లు వేసినా రైతులని నట్టింట ముంచేసాము అని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కౌలు రైతులకి ఎకరాకి 15000 ఇస్తామని హామీ ఇచ్చారు ఎందుకు అమలు చేయట్లేదని అడిగారు. 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యం ఎందుకు అని నిలదీశారు.
కాంగ్రెస్ చేస్తున్న మోసాలని ఎండగట్టడంతో రైతులకి భరోసా ఇవ్వడానికే రైతు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో రైతులంతా కలిసి బండి సంజయ్ తో పాటుగా దీక్ష చేపట్టారు. ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభా తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలని అమలు చేస్తామని చేతులెత్తేసింది అని చెప్పారు.