తెలంగాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. అయితే.. తాజాగా శవాల బండ్లకు భగవద్గీతను పెడితే..టైర్లు కోసేస్తానని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదు, హిందూ వ్యతిరేక జెండాలను బొందపెడతామని వార్నింగ్ ఇచ్చారు.
ఎవడో చనిపోతే.. భగవద్గీత పెట్టారు..ఇక నుంచి దాన్ని బంద్ చేయాలని డిమాండ్ చేశారు. ఇమామ్‌లకు ఇచ్చే గౌరవం, అర్చకులకు ఇవ్వరా? అని ప్రశ్నించారు. మేం అధికారంలోకి రాగానే బ్రహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు బండి సంజయ్.
ప్రతి జిల్లాలో వేద పాఠశాల కోసం తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, మీ బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకున్నానని వెల్లడించారు.