కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతి భవన్‌కు వెళ్లింది : బండి సంజయ్

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మరోసారి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రగతి భవన్‌కు వెళ్లిందని, పెద్ద సార్ ఆమోదం కోసం ఈ లిస్ట్ వెయిట్ చేస్తోందని, కానీ పాపం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని ప్రజలు గుర్తించారన్నారు బండి సంజయ్. అందుకే ప్రజలకు బీజేపీపై నమ్మకం పెరిగిందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ బండారాన్ని ప్రధాని నరేంద్రమోదీ బయట పెట్టారన్నారు. అడ్డామీది కూలీలను తీసుకువచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Who Are Those Four Collectors Accused By Bandi Sanjay | INDToday

బీజేపీ లిస్ట్ విషయంలో అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ జాబితా ఢిల్లీకి వెళ్లిందని, కాంగ్రెస్ జాబితా మాత్రం ప్రగతి భవన్‌కు వెళ్లిందన్నారు. పెద్దసారు కేసీఆర్ ఆమోదం కోసం ఈ జాబితా వెళ్లిన విషయం రేవంత్‌కు తెలియదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చే అవకాశమే లేదన్నారు. వీరిద్దరికి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. అధికారం కోసం మూడు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో చివరకు ఇద్దరు బకరాలు అవుతారని ఒకరు హరీశన్న, రెండోది రేవంతన్న అంటూ అన్నా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో రేవంత్ బకరా అయితే, బీఆర్ఎస్‌లో హరీశ్ రావు అన్నారు. బీజేపీలో నిజమైన నాయకులు చేరుతున్నారన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ తప్ప అన్ని పార్టీలు తిరిగారన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news