ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? : బండి సంజయ్‌

-

ప్రజాసంగ్రామ యాత్రపేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ 5వ విడత పాదయాత్ర ఇటీవల ప్రారంభమైంది. అయితే.. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. 5వ విడత పాదయాత్రలో నేడు 100 కిలోమీటర్ల మైలురాయిని దాటారు బండి సంజయ్‌. అయితే.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీఎల్ సంతోష్ జీపైనే కేసు పెడతవా? ఏసీబీ కోర్టు చెంప చెళ్లుమన్పించినా సిగ్గు రాలేదా? అని ఆయన సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటోందని, తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని, ప్రజలకిచ్చిన హామీల అమలుకు పైసల్లేవట అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

Bandi Sanjay Kumar aggressive speech //15-03-2020 - YouTube

ప్రజాధనాన్నిలూటీ చేసి లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటోందని, తెలంగాణ తలదించుకునే దుస్థితికి తీసుకొచ్చారన్నారు. బిడ్డను సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖానాపూర్ లోని పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జీలన్నీ పూర్తి చేస్తామని, డిగ్రీ కాలేజీ, రెవిన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తామన్నారు బండి సంజయ్‌. అంతేకాకుండా.. ‘ఇక్కడున్న ఎమ్మెల్యే అవినీతి అనకొండ… పాన్ షాపు నుండి పరిశ్రమలదాకా కమీషన్లే. తాలు పేరుతో రైతులను ఘోరంగా మోసం చేస్తున్న టీఆర్ఎస్ నేతలు. వడ్ల కొనుగోలు పైసలన్నీ మోదీ ప్రభుత్వమే ఇస్తోంది. గ్రామ పంచాయతీలకిచ్చే నిధులన్నీ కేంద్రానివే. పాదయాత్ర ముగింపు సభకు తరలిరండి.’ అంటూ ఆయన
ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news