కేసీఆర్ నిమ్మకాయలు పెట్టి తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారు : బండి సంజయ్

-

సీఎం కేసీఆర్‌కు జనం మీద, జనం ఓట్ల మీద నమ్మకం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘కేసీఆర్‌కు వశీకరణ మీద నమ్మకం ఉంది. నిమ్మకాయలు పెట్టి తాంత్రిక పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తే తప్పు లేదు. జనహితం కోసం చేస్తే ఫలిస్తాయి. ఇంకొకరి నాశనం కోసం చేసే పూజలు ఫలించవు. మోటార్లు మునిగిపోతే సీఎం మాట్లాడలేదు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే మాట్లాడలేదు. అన్నారం లీక్ అవుతుంటే మాట్లాడలేదు. టెండర్ల సమయంలో మాత్రమే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. దేశం మొత్తం తిరిగి కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్నారు. నదులకు నడకలు నేర్పిన నేత అని చెప్పుకున్నారు. నదిలో ఇసుక ద్వారా వేల కోట్ల దోపిడీ చేశారు. లీకేజ్, పగుళ్ల విషయంలో సీఎం స్పందించకపోవడం దారుణం.’’ అని మండిపడ్డారు.

తాంత్రిక పూజల ద్రవ్యాలు కలపడం కోసమో, కాంట్రాక్టర్ నుంచి కమీషన్ల కోసమో సీఎం.. ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తారు తప్ప నాణ్యత పరిశీలించడం కోసం కాదని ఫైరయ్యారు. నాణ్యత లోపం కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయిందని, తెలంగాణలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నా.. కేసీఆర్ ఎవరి మాట వినలేదని బండి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్.. రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కుంగిపోవడం.. విద్రోహ చర్య అంటున్నారని, అయితే వైఫల్యం ఎవరిది? అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version