కెసిఆర్ కారణంగా చనిపోయిన రైతులకు రూ. 25 లక్షలు ఇవ్వాలి : బండి సంజయ్

తెలంగాణలో కెసిఆర్ కారణంగా చనిపోయిన రైతులకు ముందు రూ 25 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కెసిఆర్ నువ్వు రాష్ట్రంలో చనిపోయిన రైతాంగానికి 25 లక్షలు నువ్వు, ఇచ్చినంక కేంద్రాన్ని అడుగు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పంజాబ్ రైతులకు 3 లక్షలు ఇస్తున్న కెసిఆర్,… తెలంగాణ లో రైతులు చనిపోతే డబ్భులు ఎందుకు ఇవ్వలేదు ..? అని నిలదీశారు.

కెసిఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? లేక, పంజాబ్ రైతుల కోసం దీక్ష చేశావా? సమాధానం చెప్పాలన్నారు. కెసిఆర్ దీక్ష చేస్తే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేశారా?
గతంలో ఢిల్లీ పోయి వచ్చి కేంద్ర పథకాలు భేష్ అన్నడన్నారని అగ్రహించారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లొచ్చి మళ్లీ ఏమి అంటాడో చూడాలి..ఫాం హౌస్ నుంచి ప్రగతి భవన్ కు ప్రగతి భవన్ నుంచి బయటకు రప్పించింది బీజేపీ అని తెలిపారు.  ఎప్పుడూ ఫామ్ హౌజ్ లో ఉండే కేసీఆర్ ను బయటకి రప్పించాం అన్నారు. ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ నే ధర్నాకు కూర్చోబెట్టాం అని బండి సంజయ్ అన్నారు.