పోచారం మనవరాలి వివాహానికి కేసీఆర్‌, జగన్‌ : నారా లోకేష్ సెటైర్లు

తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు వివాహం.. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి తో… వి ఎన్ ఆర్ ఫాం లో ఆదివారం ఘనంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్రెడ్డి అలాగే కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇద్దరూ… ఎంతో ఆప్యాయంగా పలకరించి ఉన్నారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి ఫోటోలు దిగారు ఇద్దరు ముఖ్యమంత్రులు. అయితే వీరిద్దరి ఫోటో పై… తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ సంచలన పోస్ట్ చేశారు. రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు వస్తున్నాయి… దీంతో చాలా మంది ప్రజలు మరణిస్తున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఇలా వివాహాలకు హాజరుకావడం తాను నమ్మలేక పోతున్నాను అంటూ చురకలంటించారు నారా లోకేష్. వివాహాలకు హాజరు కాకుండా… వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడాలంటూ డిమాండ్ చేశారు నారా లోకేష్. అంతేకాదు సీఎం జగన్ అలాగే కేసీఆర్ ఫోటోలను కూడా షేర్ చేశారు నారా లోకేష్.