ప్రొఫెసర్ జయశంకర్ సర్ మృతికి ముఖ్యమంత్రి కారణం : బండి సంజయ్‌

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా బీజేపీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చేనేత కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయన్నారు బండి సంజయ్‌. మా రాష్ట్రం మాకు వస్తే మాబ్రతుకులు బాగుపడతాయి అనుకుంటే మరింత దయనీయంగా పరిస్థితులు మారిపోయాయని బండి సంజయ్‌ మండిపడ్డారు. చేనేత కార్మికులకు చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా చెప్పలేని దయని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, చేనేత ద్రోహి కేసీఆర్.. ఏ ప్రాంతంలో ఏ కులం వారు ఎక్కువగా ఉంటే వారికి అనుకూలంగా మాట్లాడుతాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana BJP chief to launch padyatra from August 9 | Cities News,The  Indian Express

ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేని తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రాన్ని ఎవరు ఊహించలేరు.. ప్రొఫెసర్ జయశంకర్ బ్రతికి ఉన్నప్పుడు ఆయనను అడుగడుగున అవమానించాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన అవమానించిన కేసీఆర్ కు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్ మృతికి ముఖ్యమంత్రి కారణమని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రస్తుత చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చేనేత కార్మికులకు పెళ్లికి పిల్లను ఇచ్చే పరిస్థితి లేదని, నూలు సబ్సిడీ లేదు.. చేనేత బంధు లేదు.. చేనేత బీమా ప్రస్తావనే లేదని, చేనేత బీమాను ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 360 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోలేని ముఖ్యమంత్రి.. మన డబ్బు తీసుకువెళ్లి పంజాబ్ లో రైతులను ఆదుకోవడం విడ్డూరంగా ఉందన్నారు బండి సంజయ్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news