సిట్ నోటీసులు ఇంకా నాకు అందలేదు – బండి సంజయ్‌

-

సిట్ నోటీసులు ఇంకా నాకు అందలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మాకు విప్ జారీ చేశారు… 23,24 తేదీల్లో పార్లమెంట్ కు హాజరు కావాలని విప్ ఉందన్నారు. అటుకులు బుక్కి బతికే.. బతుకు కేసీఆర్ ది అంటూ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిట్ అంటే సీఎం సిట్ అంటే సిట్… స్టాండ్ అంటే స్టాండ్ అని… అనేక సందర్భాల్లో సిట్ వేశారు… ఒక సిట్ రిపోర్ట్ ను అయిన బయట పెట్టారా అని నిలదీశారు.

నోటీస్ లు సీఎం కు , సీఎం కొడుక్కు ఇవ్వాలి… వారు ఏమన్నా చట్టానికి అతీతుల…మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు… వారికి ఇవ్వాలన్నారు. నేను కానీ రేవంత్ రెడ్డి కానీ మాకు ప్రజల నుండి వచ్చిన సమాచారం మాట్లాడుతాము.. మాట్లాడితే నోరు మూస్తం అనే చెప్పేందుకు నోటీసులు అంటూ రెచ్చిపోయారు. బెదిరిస్తే భయ పడమని.. పేపర్ లీకేజీ సర్వసాధారణం అని ఓ కబ్జాల మంత్రి అంటున్నారని నిప్పులు చెరిగారు. BRS పార్టీ నిద్రావస్థలో ఉంది…కెసిఆర్ కి మూడిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version