ముర్మూ ను”రాష్ట్ర పత్ని’గా అభివర్ణించిన కాంగ్రెస్.. సోనియా దిష్టిబొమ్మలు దహనం చేయాలని బండి సంజయ్ పిలుపు

-

ముర్మూ ను”రాష్ట్ర పత్ని’గా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రా ష్ట్రపతి ద్రౌపది ముర్మూ ను ” రాష్ట్ర పత్ని’గా అభివర్ణిస్తూ లోక్ సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో సోనియా గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఎస్టీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని జీర్ణించుకోలేక భారత ప్రథమ పౌరురాలిపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే దేశ ప్రజలందరినీ అవమానించడమేనని వెల్లడించారు బండి సంజయ్. సోనియా గాంధీ తక్షణమే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news