భారీ వర్షాల కారణంగా నీట మునిగిన బెంగళూరు-మైసూరు హైవే …

-

ఈ వారం క్రితం నూతనంగా ప్రధాని మోదీ ప్రారంభించిన హైవే నీట మునగడం జరిగింది. ఈ నేపథ్యంలో, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటు చేసుకుంది . ఈ నెల 12న బెంగళూరు-మైసూరు హైవేను ప్రధాని మోదీ ప్రారంభించారు.118 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిని రూ. 8,480 కోట్ల వ్యయంతో నిర్,ఇంచడం జరిగింది. ఈ హైవే అందుబాటులోకి రావడంతో బెంగళూరు నుంచి మైసూరుకు ప్రయాణ సమయం కూడా మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గుతుందని ప్రధాని మోదీ తెలియచేసారు. అయితే , శుక్రవారం రాత్రి బెంగళూరులోని రామనగర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-మైసూరు ఈ హైవే నీట మునిగింది. రహదారిలోని అండర్‌ బ్రిడ్జీ వద్ద వర్షం నీరు భారీగా నిలిచిపోయింది.

దీంతో చాలా వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. తన కారు నీట మునిగి ఆగిపోయిందని, వెనుక వస్తున్న లారీ తన కారును ఢీకొట్టిందని వికాస్‌ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తపరిచారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు . ఈ రహదారి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందో లేదో అని ప్రారంభించిన ప్రధాని మోదీ, రవాణా మంత్రిత్వ శాఖతో తనిఖీ చేయించారా? అని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మేం బాధపడాలా? అని అన్నారు. భారీగా టోల్ రుసుము వసూలు చేస్తున్నారని, రహదారి ఇలా ఉంటే దాని వల్ల ఉపయోగం ఏమిటి? అని వికాస్ మండిపడ్డారు. గత ఏడాది కూడా భారీ వర్షాలకు ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొత్తగా ప్రారంభించిన హైవే వల్ల ఈ కష్టాలు తీరుతాయని వాహనదారులు అనుకున్నారు. అయితే వర్షాలకు అండర్‌ బ్రిడ్జీ వద్ద భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version